నాతో నేను మాట్లాడుకుంటాను! | I can speak with my self | Sakshi
Sakshi News home page

నాతో నేను మాట్లాడుకుంటాను!

Sep 30 2014 11:58 PM | Updated on Sep 2 2017 2:11 PM

నాతో నేను మాట్లాడుకుంటాను!

నాతో నేను మాట్లాడుకుంటాను!

ప్రయివేట్ టైమ్‌లో నా గురించి నేను...అది ఆరోగ్యం కావచ్చు, అభిరుచి కావచ్చు... రకరకాల విషయాలు ఆలోచిస్తుంటాను. నాతో నేను సంభాషించుకోవడం వల్ల ఎన్నో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. కొత్త శక్తి సమకూరినట్లు అనిపిస్తుంది.

పని-జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి మూడు ‘పి’లు ముఖ్యం అని నమ్ముతాను.

1.ప్లాన్  2.ప్రయారిటీస్ 3.ప్రయివేట్ టైమ్.
 
ప్రయివేట్ టైమ్‌లో నా గురించి నేను...అది ఆరోగ్యం కావచ్చు, అభిరుచి కావచ్చు... రకరకాల విషయాలు ఆలోచిస్తుంటాను. నాతో నేను సంభాషించుకోవడం వల్ల ఎన్నో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. కొత్త శక్తి సమకూరినట్లు అనిపిస్తుంది.
 
త్వరగా నిద్ర లేస్తాను. నా భార్యతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తుంటాను. యోగా, ధ్యానం విధిగా చేస్తాను. ప్రతి సంవత్సరం కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళుతుంటాను.
 
ప్రకృతిని ఆసక్తిగా పరిశీలించడం, దైవాన్ని గురించి ఆలోచనలు నాలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.
 
రకరకాల పుస్తకాలతో పాటు, ఎక్కువగా జీవితచరిత్రలు చదువుతుంటాను. మానసికంగా బలోపేతం కావడానికి ఇది ఉపయోగపడుతుంది. మసుసు ఉల్లాసంగా ఉండడానికి.... కర్ణాటక సంగీతాన్ని వింటాను. యం.యస్ సుబ్బులక్ష్మీ, బాలమురళీకృష్ణ, డీకే పట్టమ్మాళ్ నా అభిమాన గాయకులు.

-యంజి జార్జ్ ముత్తూట్,ముత్తుట్ ఫైనాన్స్ ఛైర్మన్, ‘ఆసియన్ బిజినెస్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ గ్రహీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement