ముత్తూట్‌ వివాహ సన్మానం.. దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

ముత్తూట్‌ వివాహ సన్మానం.. దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, Dec 19 2023 7:35 AM

Muthoot Vivaha Sammanam Project Details - Sakshi

హైదరాబాద్‌: ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ముత్తూట్‌ వివాహ సన్మానం ప్రాజెక్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వితంతువులైన తల్లుల కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం అందించడానికి సంస్థ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్పొరేట్‌ సేవా బాధ్యత(సీఎస్‌ఆర్‌) కార్యక్రమం ఇది.

ఈ ప్రాజెక్టు కింద ప్రతి లబ్ధిదారు ర.50 వేల ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. అర్హత కలిగిన లబ్ధిదారులు డిసెంబర్‌ 25 సాయంత్రం 5.30 గంటలలోగా లక్ష్మీ నారాయణ యమగాని, మేనేజర్‌ సీఆర్‌ఎస్, ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్, హైదరాబాద్‌ చిరునామాకు సమర్పించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

వితంతు తల్లులకు ఆర్థిక సాయం ద్వారా వారి ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముత్తూట్‌ ఫైనాన్స్‌ సీఎస్‌ఆర్‌ హెడ్‌ బాబు జాన్‌ మలయల్‌ తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement