హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు | Homoeo counseling | Sakshi
Sakshi News home page

హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు

May 2 2017 12:04 AM | Updated on Sep 5 2017 10:08 AM

హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు

హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు

నా వయసు 32 ఏళ్లు. నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నాను.

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 32 ఏళ్లు. నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్‌ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్‌ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో మందులు ఉన్నాయా?
– మనస్విని, హైదరాబాద్‌

మానవ జీవక్రియలకు సంబంధించి థైరాయిడ్‌ గ్రంథి చాలా ప్రధానమైనది. ఇది అనేక కార్యకలాపాలలో తనదైన ముఖ్య భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్‌ కండిషన్‌లో బరువు పెరుగుతుంది.  హైపోథైరాయిడిజమ్‌ అనేది మానవ శరీరంలో థైరాయిడ్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది.

థైరాయిడిజమ్‌ నుంచి తగినంత మోతాదులో హార్మోన్‌ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్‌ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌) అవసరం. అయోడిన్‌ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ సమస్య వస్తుంది.

లక్షణాలు : ∙బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం  జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం  గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం సంతానలేమి, నీరసం, డిప్రెషన్‌

నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, థైరాయిడ్‌ యాంటీబాడీస్, థైరాయిడ్‌ స్కానింగ్, అల్ట్రాసౌండ్‌.

చికిత్స : హైపోథైరాయిడిజమ్‌ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్‌ హోమియోపతి
హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement