చిరునవ్వుల దినోత్సవం | happy children day | Sakshi
Sakshi News home page

చిరునవ్వుల దినోత్సవం

Nov 13 2013 11:18 PM | Updated on Sep 2 2017 12:34 AM

చుట్టూ చిన్నారులుంటే చాచా నెహ్రూని పట్టలేం. పిల్లల్లో ఒక పిల్లవాడిగా మారిపోతారు. వాళ్లతో కలిసి ఆటలు ఆడతారు, పాటలు పాడతారు.

చుట్టూ చిన్నారులుంటే చాచా నెహ్రూని పట్టలేం.
 పిల్లల్లో ఒక పిల్లవాడిగా మారిపోతారు.
 వాళ్లతో కలిసి ఆటలు ఆడతారు, పాటలు పాడతారు.
 ఉయ్యాలలూగుతారు, సీతాకోకచిలుకల్ని పట్టుకునేందుకు
 పరుగులు పెడతారు. పూల జల్లుల్లో తడుస్తారు.
 హరివిల్లుల్లో విహరిస్తారు. బుజ్జాయిల బుగ్గలు పుణుకుతారు..
 వారి బోసినవ్వులలో భవిష్యత్తుని దర్శిస్తారు.
 బాలలంటే నెహ్రూకి అంత ఇష్టం కనుకే...
 ఏటా ఆయన పుట్టినరోజున బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం.
 ‘ఫ్యామిలీ’ కూడా ఇవాళ కిడ్స్‌ని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తోంది.
 అందాలొలికే పిల్లల నవ్వుల్ని మించిన
 శుభాకాంక్షలు ఏముంటాయి చెప్పండి!!

 
 1- ఎల్లో శాటిన్ షేడెడ్ నెట్ ఫ్రాక్‌ను డిజైన్ చేసి, మల్టీకలర్ గులాబీలను ఫ్రాక్‌కు  జత చేశాను.
 
 2- వెల్వెట్ లంగాకు బెనారస్ బ్రొకేడ్ బార్డర్‌ను వాడి, అక్కడక్కడా స్టోన్ వర్క్ చేసి, డిజైనర్ బ్లౌజ్‌ను జతగా అమర్చితే లుక్ కూల్‌గా మారిపోతుంది.
 
 3- ఆపిల్ గ్రీన్ సెమీ రా సిల్క్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. దీనికి పింక్ రా సిల్క్ మెటీరియల్‌తో రూపొందించిన గులాబీలను జతగా చేశారు.
 
 4- అన్‌బ్లిష్‌డ్ కోరా ఖాదీతో ఛాతీ భాగాన్ని, పర్పుల్ ఖాదీతో ఫ్రాక్‌ను రూపొందించారు. దీనికి నర్సాపూర్ లేస్ బార్డర్‌గా వాడారు.
 5- దేవదాస్‌లో పార్వతి లుక్‌కి ఇన్‌స్పైర్ అయ్యి చేసిన డిజైన్ ఇది. మెట్‌పల్లి ఖాదీ మెటీరియల్‌తో లంగాను, బ్లౌజ్‌ను డిజైన్ చేశారు.
 
 6- కలంకారీ ఖాదీతో బ్లౌజ్, నేచురల్ డై ఖాదీతో లంగాను రూపొందించారు.
 
 సుదీప, డిజైనర్, ఆలన బొటిక్
 మోడల్: సహస్ర

 
 మోడల్స్: ఏఫా, విరి, మనస్విత
 రుత్ అరసవల్లి, త్రిత్వా ఖాదీ, డిజైనర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement