
ఐ బ్రోస్‌కి షేప్ చేయించేటప్పుడు హెయిర్ ఎక్స్‌ట్రాస్ మాత్రమే తీసేయండని చెబుతుంటారు. ముఖానికి తగినట్టుగా కనుబొమల షేప్ రాకుంటే ఇబ్బంది. అందుకని..
► పెన్సిల్ తీసుకొని మీ ముక్కు చివర నుంచి కనుబొమ మొదలు వరకు (కంటి పైభాగంలో) నిటారుగా పెట్టి, మార్క్ చేయాలి. ఇప్పుడు ప్లక్కర్ లేదా థ్రెడ్ సాయంతో కనుబొమ మొదలు వద్ద గల హెయిర్ ఎక్స్‌ట్రాస్ మాత్రమే తీస్తే చాలు.
► చిత్రంలో చూపిన విధంగా ముక్కుకు వ్యతిరేక దశలో పెన్సిల్‌ను ఉంచి కనుబొమ మధ్య భాగంలో వచ్చే విధంగా మార్క్ చేయాలి. ఇది విల్లులా ఉండే భాగం.
► ముక్కు చివరన పెన్సిల్ ఉంచి వ్యతిరేక దిశలో కనుబొమ చివరన మార్క్ చేయాలి. మధ్యన, చివరన అదనపు హెయిర్ తీసేయాలి. దీంతో మీ కనుబొమ విల్లులాంటి షేప్‌కి ఇబ్బంది కలగదు.