నాకు సంతానభాగ్యం ఉందా?

Good Medicines Are Available To Solve Your Problem - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 33 ఏళ్లు. వివాహమై పదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. హోమియోలో నా సమస్యకు పరిష్కారం లభిస్తుందా?

సంతానలేమికి  అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు.
స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు:
►జన్యుసంబంధిత లోపాలు
►థైరాయిడ్‌ సమస్యలు
►అండాశయంలో లోపాలు; నీటిబుడగలు
►గర్భాశయంలో సమస్యలు
►ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో సమస్యలు
►డయాబెటిస్‌

గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో కనిపించే కారణాలు:
►హార్మోన్‌ సంబంధిత సమస్యలు
►థైరాయిడ్‌
►పొగతాగడం
శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు:
►ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ

సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ: అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్‌ సంబంధిత లోపాల వల్ల ఏర్పడుతుంది.

 సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ: మొదటి సంతానం  తర్వాత లేదా అబార్షన్‌ తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటా రు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో  లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్‌ వల్ల
సంభవిస్తుంది. గుర్తించడం ఎలా: తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్‌ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్‌ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు.
చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్‌ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

 ఇరువైపు కీళ్లలో నొప్పి... ఎందుకిలా?
నా వయసు 59 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. నొప్పి భరించలేకుండా ఉన్నాను.  హోమియో చికిత్స ద్వారా తగ్గుతుందా?

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌.  సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్‌ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి.

సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్‌’ అంటారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్యపరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. హోమియో మందుల ద్వారా ఈ వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు.
డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top