గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం కోసం...

Ginger And Garlic Will Reduce The Gas Problem - Sakshi

హెల్త్‌టిప్స్‌

ఇటీవల కాలంలో చాలా మందిని గ్యాస్‌ సమస్య వేధిస్తోంది. దీనికి రక రకాల మాత్రలు వాడేకంటే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

►కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్‌ సమస్య వస్తుంది. కాబట్టి రోజూ 6 నుంచీ 8 గ్లాసుల నీటిని తీసుకుంటే గ్యాస్‌ సమస్య తలెత్తదు.

►రోజూ భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం చాలా మంచిది. దానిని నేరుగా తినలేకపోతే కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని కూడా తినవచ్చు.

►నాలుగైదు వెల్లుల్లి రెబ్బలకు రెండేసి స్పూన్ల ధనియాలు, జీలకర్ర  తీసుకుని 5 నిముషాలపాటు ఉడికించాలి. చల్లారాక వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

►దాల్చిన చెక్క గ్యాస్‌ సమస్యకు మంచి మందు. కొద్దిగా దాల్చిన చెక్కను తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ జ్యూస్‌ ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్‌ సమస్య తొలగి పోతుంది.

►గ్యాస్‌ సమస్య ఉన్నవాళ్లు రోజూ కొబ్బరి నీళ్ళని తాగటం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా నెల రోజులు ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top