వయసుకు తగినట్టుగానే ఉందా? | Correspondingly age have | Sakshi
Sakshi News home page

వయసుకు తగినట్టుగానే ఉందా?

Jun 4 2014 10:59 PM | Updated on Apr 7 2019 4:36 PM

వయసుకు తగినట్టుగానే ఉందా? - Sakshi

వయసుకు తగినట్టుగానే ఉందా?

నేడు ఫ్యాషన్ పోకడల మూలంగా వయసు పైబడిన వారు సైతం టీనేజ్ యువతుల్లా తయారవడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తగ్గట్టు వేషధారణ, మేకప్ చేసుకుంటున్నారు.

అలంకరణ
 
నేడు ఫ్యాషన్ పోకడల మూలంగా వయసు పైబడిన వారు సైతం టీనేజ్ యువతుల్లా తయారవడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తగ్గట్టు వేషధారణ, మేకప్ చేసుకుంటున్నారు.
     
 అతి అలంకరణ వయసు మరింత పైబడినట్టు చూపిస్తుంది.
     
 సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి.
     
 మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది.
     
 పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్ వాడితే, పైన లిప్‌గ్లాస్ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి.
     
 మేకప్ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్నీ అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి.
     
 ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement