నవంబర్ 5న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | birthday on November 5 Celebrities | Sakshi
Sakshi News home page

నవంబర్ 5న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Nov 4 2015 10:32 PM | Updated on Sep 3 2017 12:00 PM

నవంబర్  5న  పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 5న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
విరాట్ కోహ్లీ (క్రికెటర్), వందనా శివ (పర్యావరణ కార్యకర్త)

 
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్ర సంఖ్య కావడం వల్ల చక్కటి రూపం, శారీరక సౌష్టవంతో సృజనాత్మకత, కళాత్మక హృదయం, అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి సంపన్న జీవితం గడుపుతారు. ఈ సంవత్సరమంతా ఉత్సాహవ ంతంగా ఉంటుంది. కొత్త వాహనాలు కొంటారు. విలువైన వస్త్రాభరణాలకి ఖర్చు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో పడతారు. సంఘంలో గౌరవం, ఆర్థిక ఉన్నతి, రాజకీయాలలో ఉన్న వారికి పదవీప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులు ఆగిపోయిన చదువును కొనసాగిస్తారు. పోటీపరీక్ష లలో విజయాన్ని, మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. అలంకారాలు, ఇంటీరియర్ డెకరేషన్‌కు ప్రాధాన్యత ఇస్తారు.పుట్టిన తేదీ 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, కలిగి ఉంటారు.

కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం లేదా కొత్త కోర్సులు చే యడం జరుగుతుంది. నెమ్మదిగా నడుస్తున్న ప్రాజెక్టులను వేగవంతం చేయడం లేదా లాభాల బాటలో పడేటట్లు చేస్తారు. ఉద్యోగులు వ్యాపారాన్ని లేదా కొత్తప్రాజెక్టుని ఆరంభిస్తారు. మీడియా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది.
 

లక్కీ నంబర్స్: 1,2,3,5,6; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, పర్పుల్, రెడ్, ఆరంజ్, ఎల్లో; లక్కీడేస్: సోమ, బుధ, గురు, శుక్ర, ఆదివారాలు;
 సూచనలు: అహంకారాన్ని, ఆవేశపూరిత నిర్ణయాలను విడనాడడం, పేదవిద్యార్థులకు కావలసిన టూల్‌కిట్స్ కొనిపెట్టడం, లక్ష్మీ అష్టోత్తరాన్ని, విష్ణుసహస్రనామాలను పారాయణ చేయడం. పేదకన్యల వివాహానికి తగిన సాయం చేయడం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement