పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 14 2015 11:23 PM | Updated on Jun 2 2018 8:51 PM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు - Sakshi

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఈ సంవత్సరం వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది...

జూన్ 15 హ్యాపీ బర్త్ డే
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అన్నా హజారే (సామాజిక కార్యకర్త), లక్ష్మీమిట్టల్ (పారిశ్రామికవేత్త)
 
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఈ సంవత్సరం వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. ప్రేమాభిమానాలను ఇచ్చి పుచ్చుకుంటారు. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలై ఈ సంవత్సరం జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వ్యతిరేకులు సైతం మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. విలాస వస్తువులు లేదా వాహనం సమకూర్చుకుంటారు. విద్యార్థులకు  కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. ఇతర దేశాలలో చదువుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. చంద్రుని ప్రభావం వల్ల ఆలోచనలలో నిలకడ లేక గందరగోళం నెలకొంటుంది.

లక్కీ నంబర్స్: 2,5,6,7; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, శుక్ర, శనివారాలు
సూచనలు: రోజూ రాత్రిపూట కనీసం ఒక అరగంటపాటు వెన్నెలలో విహరించడం, నవగ్రహాభిషేకం, అనాథ శరణాలయాల్లో పాయసం దానం చేయడం, దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం మంచిది.
- డా. మహమ్మద్ దావూద్
జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement