బంగాళదుంప నీటితో కురుల నిగారింపు...

Bathing with potato juice does not come with a white hair - Sakshi

బ్యూటిప్స్‌

►బంగాళదుంపను తురిమి, ఒక పల్చటి క్లాత్‌లో వేసి, పిండి, రసం తీయాలి. ఒక పాత్రలో  మూడు టీ స్పూన్ల బంగాళాదుంప రసం, గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్‌ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 10–15 నిమిషాల తర్వాత వెచ్చని నీటిని ఉపయోగిస్తూ షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో మూడు సార్లు ఇలా చేస్తూ ఉంటే జీవం లేని కురుల నిగనిగలు పెరుగుతాయి.  

►బంగాళాదుంప తొక్క తీసి, నీటిలో వేసి, 20 నిమిషాలు ఉడికించి, తీయాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత బంగాళాదుంప ఉడికించిన నీటితో జుట్టును కడగాలి. తల స్నానం చేసిన ప్రతీసారీ ఇలా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు ఎరుపురంగులోకి మారుతుంది.

►జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటే.. మూడు టీస్పూన్ల బంగాళాదుంప రసం, మూడు టీ స్పూన్ల అలొవెరా రసం, రెండు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top