ఏటీఎం పనిచేసేదిలా... | atm working principle | Sakshi
Sakshi News home page

ఏటీఎం పనిచేసేదిలా...

Dec 13 2015 3:38 PM | Updated on Sep 3 2017 1:57 PM

ఏటీఎం పనిచేసేదిలా...

ఏటీఎం పనిచేసేదిలా...

కార్డు పెట్టామా... పిన్ నెంబర్ ఎంటర్ చేశామా... డబ్బు తీసుకున్నామా!

కార్డు పెట్టామా... పిన్ నెంబర్ ఎంటర్ చేశామా... డబ్బు తీసుకున్నామా! అంతే.. ఏటీఎంతో మన పనైపోతుంది. కానీ... మనం టైప్ చేసిన మొత్తాన్ని అది లెక్కకట్టి ఎలా ఇస్తుంది? లేదా డిపాజిట్ మొత్తాన్ని కచ్చితంగా ఎలా లెక్కకట్టి అకౌంట్‌లోకి జమ చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించామా? ఇదంతా ఎలా జరుగుతుందో చూడండి మరి...
 
 మీరు ఏటీఎంలోకి కార్డు జొప్పించగానే...
* కార్డు వెనుకభాగంలోని అయస్కాంత పట్టీలో నిక్షిప్తమై ఉన్న మీ సమాచారం మొత్తం బ్యాంక్ సర్వర్‌కు చేరుతుంది.
* అన్నీ సక్రమంగా ఉంటే ఆ సమాచారం తిరిగి ఏటీఎంలోని కంప్యూటర్‌కు అందుతుంది.
* నాలుగు అంకెల పిన్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తరువాత కూడా ఇదే ప్రక్రియ మరోసారి నడుస్తుంది.
* మీరు విత్‌డ్రా చేయాల్సిన మొత్తాన్ని టైప్ చేయగానే.. ఏటీఎంలోని క్యాష్‌బాక్స్‌ల వద్ద హడావుడి మొదలవుతుంది.
*  ఉన్న  క్యాష్‌బాక్స్‌ల చివరలో ఉన్న మూత తెరుచుకుంటాయి.
 * లైట్ సెన్సర్లు నోట్ల విలువను గుర్తిస్తే.. క్యాష్‌బాక్స్‌కు అనుసంధానమైన యంత్రాలు (సక్షన్ మెషీన్స్) అవసరమైనన్ని నోట్లను బయటకు తీస్తాయి.
 *  నకిలీ, నలిగిపోయిన నోట్లు వస్తే... వాటిని ప్రత్యేకమైన బాక్స్ (రిజెక్ట్ బాక్స్)లోకి పడేసి మళ్లీ క్యాష్‌బాక్స్ నుంచి నోట్లు వెలికితీస్తాయి. కావాల్సిన మొత్తం అందేవరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
 * క్యాష్‌బాక్స్‌ల పై భాగంలో ఏర్పాటు చేసిన రోలర్ల మధ్య నుంచి నోట్లు ఏటీఎంలో మనం క్యాష్ తీసుకునే చోటికి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement