
బొబ్బిలి కోట సాక్షిగా జగన్ నినాదాలు
బొబ్బిలి కోట సాక్షిగా జగన్ నినాదాలు మారుమోగాయి. వేలాది మంది వైఎస్‌ఆర్ అభిమానులు జగన్ అడుగులో అడుగేయడానికి కదిలారు.
బొబ్బిలి : బొబ్బిలి కోట సాక్షిగా జగన్ నినాదాలు మారుమోగాయి. వేలాది మంది వైఎస్‌ఆర్ అభిమానులు జగన్ అడుగులో అడుగేయడానికి కదిలారు. ప్రజల కోసం పని చేసే నాయకుడి వెంటే ఉంటామంటూ నినదించారు. తల్లులు బిడ్డలను చంకన వేసుకుని వచ్చి జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నీకు మేమున్నాం అన్నా అని జగన్‌ను కలిసిన యువత చెప్పడం కనిపించింది.
వైఎస్ఆర్ జనభేరి ప్రచారంలో భాగంగా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ..ధైర్యం చెబుతూ జగన్ ముందుకు కదిలారు. కాసేపటి క్రితం గుల్లాసీతారామపురం, పారాదిలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం సాలూరులో వైఎస్ఆర్ జనభేరి జరగనుంది. ఈ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.