'మోడీ ప్రత్యర్థులకు డిపాజిట్లు రావు' | Narendra Modi Opponents in Varanasi will lose their deposit, says ravi shankar prasad | Sakshi
Sakshi News home page

'మోడీ ప్రత్యర్థులకు డిపాజిట్లు రావు'

May 10 2014 1:48 PM | Updated on Aug 14 2018 4:24 PM

రవిశంకర్ ప్రసాద్ - Sakshi

రవిశంకర్ ప్రసాద్

ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ దీమా వ్యక్తం చేశారు.

వారణాసి: ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ దీమా వ్యక్తం చేశారు. మోడీకి లక్షల సంఖ్యలో మెజారిటీ వస్తుందన్నారు. మిగతా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు.

కాశీలో రాహుల్ గాంధీ నేడు నిర్వహించిన రోడ్ షోకు స్పందన అంతంత మాత్రంగానే ఉందని మరో బీజేపీ నేత షాహనాజ్ హుస్సేన్ ఎద్దవా చేశారు. రోడ్ షోకు వచ్చిన వారిలో ఏ మాత్రం ఉత్సాహం లేదన్నారు. నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement