'కొండా దంపతులను ఎలా చేర్చుకున్నారు' | Madhu yaskhi takes on kcr | Sakshi
Sakshi News home page

'కొండా దంపతులను ఎలా చేర్చుకున్నారు'

Apr 7 2014 12:07 PM | Updated on Mar 18 2019 9:02 PM

'కొండా దంపతులను ఎలా చేర్చుకున్నారు' - Sakshi

'కొండా దంపతులను ఎలా చేర్చుకున్నారు'

తెలంగాణ వ్యతిరేకులైన కొండా సురేఖ దంపతులను టీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ ప్రశ్నించారు.


హైదరాబాద్ : తెలంగాణ వ్యతిరేకులైన కొండా సురేఖ దంపతులను టీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ ప్రశ్నించారు. కేసీఆర్ అధికార దాహంతో ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఎంపీ వివేక్ నివాసంలో పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, మధుయాష్కీ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు.

కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం కాకపోవటంతో తనపై కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగిందని వివేక్ ఈ సందర్భంగా తెలిపారు. అందుకే తిరిగి కాంగ్రెస్లో చేరానని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబుతో ఎలాంటి విభేదాలు లేవని వివేక్ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement