
ఎన్నికల్లో గెల్చినోళ్లు ఇంటికెళ్లి ఏడుస్తారు: డొక్కా
సీమాంధ్ర ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బులు విపరీతంగా ఖర్చు చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు.
హైదరాబాద్: సీమాంధ్ర ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బులు విపరీతంగా ఖర్చు చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. గెలిచిన వారు ఇంటికెళ్లి ఏడుస్తారు, ఓడినవారు కౌంటింగ్ కేంద్రం వద్ద ఏడుస్తారని వెల్లడించారు.
డబ్బులు పంచిన కొందరు అభ్యర్థులు రాజకీయంగా, మానసికంగా, ఆర్థికం దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో చంద్రబాబు, నరేంద్ర మోడీలపై వ్యతిరేకత బలంగా ఉందని.. ఈ ఓట్లు వైఎస్‌ఆర్ సీపీకి వెళ్తే ఆ పార్టీ గెలుస్తుందని వరప్రసాద్ విశ్లేషించారు.