ముదురుతున్న విభేదాలు | Conflicts between TDP leaders | Sakshi
Sakshi News home page

ముదురుతున్న విభేదాలు

Apr 29 2014 4:14 AM | Updated on Aug 10 2018 8:06 PM

పులివెందుల టీడీపీలో నెలకొన్న విభేదాలు ముదురుతున్నాయి. పులివెందుల సెగ్మెంట్‌లో బలంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని ఢీకొట్టలేక సతమతమవుతున్న ‘దేశం’కు విభేదాల సెగ మరింత కుంగదీస్తోంది.

 పులివెందుల, న్యూస్‌లైన్ : పులివెందుల టీడీపీలో నెలకొన్న విభేదాలు ముదురుతున్నాయి. పులివెందుల సెగ్మెంట్‌లో బలంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని ఢీకొట్టలేక సతమతమవుతున్న ‘దేశం’కు విభేదాల సెగ మరిం త కుంగదీస్తోంది. పార్టీ టిక్కెట్ వ్యవహారంలో సతీష్‌రెడ్డి, రాంగోపాల్‌రెడ్డిల మధ్య పొడచూపిన విభేదాలు కీలక నేతలనుంచి.. సాధారణ కార్యకర్తల స్థా యి వరకు పాకాయి. ఒక వర్గం టీడీపీ అభ్యర్థి సతీష్‌రెడ్డికి అండగా ఉండగా.. మరొక వర్గం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డికి మద్దతు పలుకుతూ వస్తుండటం చూస్తే.. ‘దేశం’ పరిస్థితి ఏమవుతుం దోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
 గంగమ్మ చింతలలో ఆత్మీయ సదస్సు
 తొండూరు మండల టీడీపీ అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి ఆధ్వర్యంలో  తొండూరు మండలం కృష్ణంగారిపల్లె సమీపంలో  ఉన్న గంగమ్మ చింతల దేవాలయం వద్ద జరిగిన కార్యకర్తల ఆత్మీయ సదస్సుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి హాజరై చర్చించారు. ఈ సదస్సుకు తొండూరు మండలం నుంచి  అన్ని గ్రామాల కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. సతీష్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా తమను విస్మరించారని టీడీపీ కీలక నేతలు రాంగోపాల్‌రెడ్డి దృష్టికి  తీసుకెళ్లారు. పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్ధాల తరబడి  సేవ చేస్తున్న వారిని పక్కనపెట్టడంపట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నా.. గ్రామాల్లో ప్రచారం  చేస్తున్నా  కనీసం సమాచారం అందించే నాథుడు లేకపోవడం విచారకరమన్నారు. అటు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ.. ఇటు రైతులకు సంబంధించి 2011-12 రబీ పంటల బీమా కోసం ఆమరణ దీక్ష పేరుతో ఉద్యమం చేపట్టి ప్రజలలో పార్టీ ప్రతిష్ట పెంచిన రాంగోపాల్‌రెడ్డిని ఎందుకు విస్మరిస్తున్నారంటూ పలువురు ప్రశ్నించారు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా పార్టీని అంటిపెట్టుకుని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న రాంగోపాల్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తొండూరు మండల కార్యకర్తలు, నాయకులు తేల్చి చెప్పారు. సదస్సుకు వెళ్లవద్దంటూ కొంతమంది ఫోన్లు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని పలువురు కార్యకర్తలు  చర్చించుకోవడం కనిపించింది. తొండూరు మండల టీడీపీ అధ్యక్షులు దస్తగిరిరెడ్డి, మాజీ అధ్యక్షులు రమణారెడ్డి, పాలూరు ఈశ్వరరెడ్డి, మల్లేల టీడీపీ నాయకులు చింతకుంట చంద్రశేఖరరెడ్డి, హరుణ్, సింగిల్ విండో డెరైక్టర్ తుమ్మలపల్లె నాగేశ్వరరెడ్డి, సైదాపురం ఓబుళరెడ్డి, నాగేశ్వరరెడ్డి, గంగనపల్లె చిన్న ఓబుళరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు గంగ శేఖర్, తేలూరు సూర్యనారాయణరెడ్డి, కొత్తపల్లె గంగిరెడ్డి, మడూరు గోపాల్, గోటూరు విశ్వనాథరెడ్డి, బ్రహ్మానందరెడ్డిలతోపాటు వందలాది మంది కార్యకర్తలు సదస్సులో పాల్గొన్నారు.
 
 29న చక్రాయపేటలో ఆత్మీయ సదస్సు
 కార్యకర్తల మనోభావాలు కాపాడటమే లక్ష్యంగా సీనియర్ కార్యకర్తల సమస్యలను తెలుసుకోవడమే ధ్యేయంగా ఆత్మీయ సదస్సులను నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ఈనెల 29న చక్రాయపేట మండలంలో, 30న వేముల మండలంలో ఆత్మీయ సదస్సులను నిర్వహిస్తున్నామని.. అనంతరం మిగతా మండలాల్లో కూడా సదస్సులు ఉంటాయని రాంగోపాల్‌రెడ్డి తేటతెల్లం చేశారు.
 
 కొట్టుకున్న తెలుగుతమ్ముళ్లు
 పులివెందుల రూరల్/అర్బన్, న్యూస్‌లైన్ : నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మ రోసారి భగ్గుమన్నాయి. సోమవారం పార్టీ కార్యాల యంలోనే టీడీపీ నేతలు  పుచ్చా వరప్రసాద్‌రెడ్డి, హే మాద్రిరెడ్డి కొట్టుకున్నట్లు  తెలిసింది. ఇటీవల జరి గిన మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలలో డబ్బు పంపిణీ విషయంపై వాదోపవాదాలు జరిగి ఒకరిపైఒకరు చేయి చేసుకున్నట్లు సమాచారం. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల సమయం లో అభ్యర్థులు, ఇతరత్రా వాటికి సంబంధించిన డబ్బుల లావాదేవీలో ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడచూపాయి. అవి మితిమీరడంతో పార్టీ కార్యాల యంలో కార్యకర్తల అందరి ముందే ఒకరిపై మరొకరు  చేయి చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement