నెల జీతం అదనంగా ఇప్పించండి | Advance salary to give for police officers committee | Sakshi
Sakshi News home page

నెల జీతం అదనంగా ఇప్పించండి

Apr 11 2014 2:58 AM | Updated on Sep 2 2017 5:51 AM

వరుసగా వచ్చిన ఎన్నికల బందోబస్తు కోసం గడిచిన కొన్ని రోజలుగా నిర్విరామంగా శ్రమిస్తున్న పోలీసులకు ఒక నెల జీతం అదనంగా ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం..

భన్వర్‌లాల్‌ను కోరిన పోలీసు అధికారుల సంఘం
 సాక్షి, హైదరాబాద్: వరుసగా వచ్చిన ఎన్నికల బందోబస్తు కోసం గడిచిన కొన్ని రోజలుగా నిర్విరామంగా శ్రమిస్తున్న పోలీసులకు ఒక నెల జీతం అదనంగా ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం.. ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్‌కు గురువారం వినతిపత్రం అందించింది. సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి మాట్లాడుతూ..  ఎన్నికల విధులను సమర్థంగా నిర్వహిస్తున్న పోలీసులకు 45 రోజుల టీఏను సైతం తక్షణం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి పి.రమాకాంత్‌రెడ్డిని సైతం కలిసిన అధికారుల సంఘం ఒంగోలు జిల్లాలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement