వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | ys jagan mohan reddy console venkata ramanamurthy family members | Sakshi
Sakshi News home page

వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Feb 2 2016 7:51 PM | Updated on Jul 25 2018 4:09 PM

వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిన్న కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్న కాపు ఉద్యమకారుడు వెంకట రమణమూర్తి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు...

కాకినాడ : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిన్న కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్న కాపు ఉద్యమకారుడు వెంకట రమణమూర్తి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. కాకినాడ డైయిరీ ఫామ్ సమీపంలోని వెంకట రమణమూర్తి నివాసానికి వెళ్లిన ఆయన... కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అధైర్యపడొద్దని, వారి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ  అండగా ఉంటుందని  వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఏ కష్టం ఎదురైనా తాము ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరూ భావోద్వేగాలకు లోనై ప్రాణాలు తీసుకోవద్దని వైఎస్ జగన్ కోరారు.  ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. కాగా  శ్రీకాకుళం జిల్లాలో యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా కాకినాడ చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement