వినాయక నిమజ్జనం పూర్తి చేసుకుని వస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టగా ఒక యువకుడు చనిపోయాడు.
పాల్వంచ రూరల్ (ఖమ్మం): వినాయక నిమజ్జనం పూర్తి చేసుకుని వస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టగా ఒక యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో బుధవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.
పాల్వంచ రూరల్ మండలం బసవతారకం కాలనీకి చెందిన అధికారి శివ(25) బుధవారం రాత్రి మిత్ర బృందంతో కలిసి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశాడు. అనంతరం ఆటో ట్రాలీలో తిరిగి వస్తుండగా ఇందిరాకాలనీ వద్ద ఎదురుగా ట్రాక్టర్ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే చనిపోయాడు. అతని మిత్రులు స్వల్పంగా గాయపడ్డారు.