వరి సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి అన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని మల్లవరం, చంద్రవరం గ్రామాల్లో మంగళవారం జరిగిన రైతు సదస్సుల్లో ఆమె మాట్లాడారు.
సమగ్ర యాజమాన్య పద్ధతులతో దిగుబడులు మెండు
Aug 16 2016 11:46 PM | Updated on Sep 4 2017 9:31 AM
చాగల్లు : వరి సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి అన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని మల్లవరం, చంద్రవరం గ్రామాల్లో మంగళవారం జరిగిన రైతు సదస్సుల్లో ఆమె మాట్లాడారు. రైతులు ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు ఈపాస్ యంత్రాల ద్వారా ఎరువులు విక్రయిస్తారని, దీనిలో భాగంగా చాగల్లు మండలానికి 19 యంత్రాలు అందించామన్నారు. వ్యవసాయశాఖ ఏడీ∙ఎస్‌జెవిజే రామోహన్‌రావు మాట్లాడుతూ కలుపు నివారణ, నీటి యాజమాన్యం, తెగుళ్లనివారణ సకాలంలో చేపట్టడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. మండల వ్యవసాయ అధికారి కె.ఏసుబాబు మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఎంటీయూ 1121 వరి వంగడాలను పరిశీలించారు. అధికారులు ఎన్.శ్రీనివాస్, కె.వాణిసర్వశ్రీ పాల్గొన్నారు
Advertisement
Advertisement