శ్రీశైలంలో తగ్గిన రెండు టీఎంసీల నీరు | water level decrease in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో తగ్గిన రెండు టీఎంసీల నీరు

Aug 18 2016 12:51 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం జలాశయంలో రెండు టీఎంసీల నీరు తగ్గింది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం వస్తున్నప్పటికీ జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు నీరు విడుదలవుతుండడంతో బుధవారం సాయంత్రం సమయానికి సుమారు 2 టీఎంసీల నీరు తగ్గింది.

శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయంలో రెండు టీఎంసీల నీరు తగ్గింది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం వస్తున్నప్పటికీ జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు నీరు విడుదలవుతుండడంతో బుధవారం సాయంత్రం సమయానికి సుమారు 2 టీఎంసీల నీరు తగ్గింది. ప్రస్తుతం జలాశయంలో 162.0554 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 874.70 అడుగులకు చేరుకుంది. జూరాల నుంచి 24వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, జలాశయం నుంచి 50,845 క్యూసెక్కుల  నీరు విడుదలవుతోంది. రెండు పవర్‌ హౌస్‌లలో 6 జనరేటర్లతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 34,620 క్యూసెక్కులు దిగువ నాగార్జునసాగర్‌కు.. 14,200 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా హంద్రీనీవా సుజలస్రవంతికి 2025 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement