వైశాఖం.. వైభోగం.. | vysakham vybhogam | Sakshi
Sakshi News home page

వైశాఖం.. వైభోగం..

Apr 30 2017 12:12 AM | Updated on Sep 5 2017 9:59 AM

రత్నగిరి సత్యదేవుని సన్నిధి పెళ్లి బాజాల మోతతో మార్మోగుతోంది. ఏడాదిలో అత్యధికంగా వివాహాలు జరిగే వైశాఖ మాసం గురువారం నుంచి ప్రారంభమైన విషయం విదితమే. దివ్యమైన వివాహ ముహూర్తాలుండడంతో రత్నగిరిపై రెండురోజులుగా పెళ్లిళ్లు జోరుగా

సత్యదేవుని సన్నిధిలో జోరుగా కల్యాణాలు
గత రెండ్రోజుల్లో 200 వివాహాలు
శనివారం పగలు కూడా ఒక్కటైన జంటలు
మే నెలంతా, జూ¯ŒS 18 వరకూ పెళ్లిళ్లే పెళ్లిళ్లు
 
అన్నవరం : 
రత్నగిరి సత్యదేవుని సన్నిధి పెళ్లి బాజాల మోతతో మార్మోగుతోంది. ఏడాదిలో అత్యధికంగా వివాహాలు జరిగే వైశాఖ మాసం గురువారం నుంచి ప్రారంభమైన విషయం విదితమే.     దివ్యమైన వివాహ ముహూర్తాలుండడంతో రత్నగిరిపై రెండురోజులుగా పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి. వైశాఖ శుద్ద తదియ, శుక్రవారం రోహిణి నక్షత్రం శుభముహూర్తంలో రాత్రి 12: 40, శనివారం తెల్లవారుజామున 3 : 40 గంటల ముహూర్తంలో పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలకు విచ్చేసిన పెళ్లిబృందాల వాహనాలతో శుక్రవారం రాత్రి దేవస్థానం కళాశాల మైదానం నిండిపోయింది.
శనివారం పగలు కూడా జోరుగా పెళ్లిళ్లు
రోహిణీ న„ýక్షత్రం ఉండడంతో శనివారం ఉదయం 11–19 గంటల ముహూర్తంలోనూ దేవస్థానంలో వివాహాలు జరిగాయి. రోశయ్య మండపం, సర్క్యులర్‌ మండపం ఈ వివాహాలకు విచ్చేసిన బంధుమిత్రులతో నిండిపోయింది. గత రెండు రోజుల్లో సుమారు 200కి పైగా వివాహాలు జరిగినట్టు అధికారులు తెలిపారు.
మే, జూ¯ŒS నెలల్లో జోరుగా వివాహ ముహూర్తాలు
వైశాఖ మాసంలో ఈనెల 30, మే నెలలో 4, 6, 7, 8, 11, 12, 13, 14, 17, 18, 19, 20, 21 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉండడంతో ఆయా రోజుల్లో  వివాహాలు జరుగునున్నాయి. అదే విదంగా జ్యేష్ట మాసంలో మే 27, 28, 29, 31 తేదీల్లో, జూ¯ŒS నెలలో ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకూ వివాహ ముహూర్తాలు ఉన్నాయి. వీటి తరువాత ఆషాఢమాసం, ఇతర కారణాల వల్ల సుమారు 40 రోజుల పాటు వివాహాలకు విరామం. తిరిగి జూలై 27వ తేదీ నుంచి వివాహాలు జరుగనున్నాయని పండితులు తెలిపారు. 
నవ దంపతులతో ఆలయప్రాంగణం కిటకిట
భారీగా విచ్చేసిన నవదంపతులు, వారి బంధుమిత్రులతో శనివారం సత్యదేవుని సన్నిధి నిండిపోయింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున, ఉదయం రత్నగిరిపై పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. వీరంతా సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించి పూజలు చేశారు. దీంతో రత్నగిరిపై ఎక్కడ చూసినా నవదంపతులు కనువిందు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement