'ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం' | varaprasad rao takes on chandrababu | Sakshi
Sakshi News home page

'ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం'

Jun 14 2016 12:52 PM | Updated on Jul 28 2018 3:33 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్ స్పష్టం చేశారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వరప్రసాద్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారన్నారు.

హోదా ఇవ్వకుంటే కేంద్ర మంత్రి వర్గం నుంచి మంత్రులను ఉపసంహరించుకుంటామని ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారని చంద్రబాబును వరప్రసాద్ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అసమర్థతతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వరప్రసాద్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement