28న విశ్వవిద్యాలయాల బంద్
నెల్లూరు(అర్బన్):
ఈనెల 28వ తేదీన రాష్ట్ర వ్యాపితంగా ఉన్న విశ్వవిద్యాలయాలను బంద్ చేస్తున్నామని విక్రమ సింహపురి యూనివర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి దారా వెంకటేశ్వర్లు తెలిపారు.
నెల్లూరు(అర్బన్):
ఈనెల 28వ తేదీన రాష్ట్ర వ్యాపితంగా ఉన్న విశ్వవిద్యాలయాలను బంద్ చేస్తున్నామని విక్రమ సింహపురి యూనివర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి దారా వెంకటేశ్వర్లు తెలిపారు. బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం స్థానిక వర్సిటీ కళాశాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విశ్వవిద్యాలయాల్లో సమస్యలు పేరుకుని పోయాయని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయాలని, ప్రతి యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ పి.శివశంకర్‌ను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జయచంద్ర, ప్రతాప్, రఘు, సురేంద్ర, నరేష్ పాల్గొన్నారు.