విజయవాడ క్రీడాకారుల హవా | TT Championship at Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ క్రీడాకారుల హవా

Aug 29 2016 10:10 PM | Updated on Sep 4 2017 11:26 AM

విజయవాడ క్రీడాకారుల హవా

విజయవాడ క్రీడాకారుల హవా

ఏపీ స్టేట్‌ ఇంటర్‌ స్కూల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ సోమవారం స్థానిక దండమూడి రాజగోపాల్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమైంది.

విజయవాడ స్పోర్ట్స్‌ : ఏపీ స్టేట్‌ ఇంటర్‌ స్కూల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ సోమవారం స్థానిక దండమూడి రాజగోపాల్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమైంది. జిల్లా టేబుల్‌ టñ న్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఎలెవన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ దేశవ్యాప్తంగా టీటీ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ టోర్నీని ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్‌డీవో ఎండీ సిరాజుద్దీన్‌ ప్రార ంభించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ఎలెవన్‌ స్పోర్ట్స్‌ ఈ టోర్నీని నిర్వహించడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడి గెలవాలన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న శాప్‌ వోఎస్‌డీ పి.రామకృష్ణ మాట్లాడుతూ దండమూడి రాజగోపాల్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆడినవారిలో అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని పేర్కొన్నారు. టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు పోటీల్లో విజయవాడ పాఠశాలల క్రీడాకారులు సత్తా చాటారు.

తొలి రోజు ఫలితాలు
జూనియర్‌ బాలికల విభాగం  ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సెయింట్‌ జాన్స్‌(విజయవాడ)పై 0–3 తేడాతో ఎన్‌ఎస్‌ఎం(విజయవాడ) స్కూల్, కేంద్రీయ విద్యాలయం(విశాఖపట్నం)పై 1–3 తేడాతో రవీంద్రభారతి స్కూల్‌(విజయవాడ), గోమతి స్కూల్‌(నెల్లూరు)పై 2–3 తేడాతో బాలాజీ స్కూల్‌ (విశాఖపట్నం) విజయం సాధించాయి. గన్నవరం జెడ్పీ హైస్కూలుపై 1–3 తేడాతో శ్రీచైతన్య స్కూల్‌(ప్రొద్దుటూరు), డీఏఎస్‌(విశాఖపట్నం)పై 0–3 తేడాతో అక్షర స్కూల్‌(అనంతపురం), విశాఖ వ్యాలీ స్కూలు(విశాఖపట్నం)పై 2–3 తేడాతో శ్రీచైతన్య(అనంతపురం) పాఠశాల గెలుపొందాయి. జూనియర్‌ బాలుర విభాగంలో అక్షర(నెల్లూరు)పై 1–3 తేడాతో అక్షర(కాకినాడ), శ్రీచైతన్య ఇంగ్లిష్‌ మీడియం స్కూలు(విజయవాడ)పై 1–3 తేడాతో బాపనయ్య స్కూల్‌(విజయవాడ), రవీంద్రభారతి(విజయవాడ)పై 1–3 తేడాతో సెయింట్‌ జాన్స్‌(విజయవాడ), ఏజీఎస్‌ స్కూల్‌(అనంతపురం)పై 1–3 తేడాతో లిటిల్‌ ఏంజిల్స్‌ స్కూల్, భాష్యం బ్లూమ్స్‌(గుంటూరు)పై 0–3 తేడాతో ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌(విజయవాడ) విజయం సాధించాయి. విశాఖ వ్యాలీ స్కూల్‌పై 1–3 తేడాతో సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌(విజయవాడ), నలంద విద్యానికేతన్‌(విజయవాడ)పై 0–3 తేడాతో డీపీఎస్‌(విజయవాడ) గెలుపొందాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement