స్థానిక గైట్ కళాశాలలో సాంకేతిక విద్యా ఉత్సవాలు ‘మేథ 2016’ బుధవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్టు కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ 15న భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో తమ కళాశాలలో ప్రతి ఏటా మేథ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.
నేటి నుంచి గైట్‌లో మేథ 2016
Sep 13 2016 8:49 PM | Updated on Sep 4 2017 1:21 PM
	వెలుగుబంద (రాజానగరం) :
	 
					
					
					
					
						
					          			
						
				
	స్థానిక గైట్ కళాశాలలో సాంకేతిక విద్యా ఉత్సవాలు ‘మేథ 2016’ బుధవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్టు కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ 15న భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో తమ కళాశాలలో  ప్రతి ఏటా మేథ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజున జెఎన్‌టీయూకే వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా యువ ఇంజనీర్లకు విద్య, విజ్ఞానపరమైన వివిధ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. 
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
