
ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అయిన HCLTech.. హైదరాబాద్‌లోని హైస్కూల్ గ్రాడ్యుయేట్ల కోసం టెక్‌బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్‌ను అందించాలని & వారికి టెక్నాలజీ పరిశ్రమలో కెరీర్‌లను నిర్మించుకునే అవకాశాన్ని కల్పించాలని యోచిస్తోంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టెక్‌బీ అనేది ప్రత్యేకంగా హైస్కూల్ గ్రాడ్యుయేట్ల కోసం రూపొందించిన ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోగలరు. ఇది టెక్నాలజీలో ప్రపంచ కెరీర్‌లకు పునాదులు వేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది.
టెక్‌బీ గ్రాడ్యుయేట్లు ఇప్పటికే ఏఐ & క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో తమ సహకారాన్ని అందిస్తున్నారు. HCLTech ఫార్చ్యూన్ 500 క్లయింట్‌లకు సేవలు అందిస్తున్నారు.
ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్‌లో 3 లక్షల ఉద్యోగాలు!
టెక్‌బీ అనేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల కంటే ముఖ్యమైంది. ఇది టెక్ రంగంలో కెరీర్‌లను నిర్మించుకోవడానికి సహకరిస్తుందని.. HCLTech సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ అన్నారు. బిట్స్ పిలానీ. ఐఐటీ గువహతి, శాస్త్ర యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, ఐఐఐటీ కొట్టాయం, ఐఐఎం సిర్మౌర్ వంటి సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఈ కార్యక్రమం యువతకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పెంపొందిస్తుంది.