పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నిడమనూరు : ప్రత్యేకావసరాలుగల పిల్లల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను తల్లిదండ్రులు వారికి వినియోగించాలని ఐఈఆర్టీ కో–ఆర్డినేటర్ రవినాయక్ అన్నారు.
నిడమనూరు : ప్రత్యేకావసరాలుగల పిల్లల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను తల్లిదండ్రులు వారికి వినియోగించాలని ఐఈఆర్టీ కో–ఆర్డినేటర్ రవినాయక్ అన్నారు. నిడమనూరు ఎమ్మార్సీలో శనివారం ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారంలో ఒక రోజు ఆయా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీల్లో అలాంటి పిల్లలకు ఫిజియోథెరపీ చికిత్స అందిస్తుందన్నారు. వైకల్యాన్ని బట్టి వారికి కావలసిన పరికరాలను అందిస్తుందని, అవసరమైన వారికి ఉన్నత స్థాయిలో ఉచిత చికిత్స సైతం చేయిస్తున్నారని తెలిపారు. ఎంఈఓ బాలునాయక్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఐఈఆర్టీలు అనంతరాములు, వెంకటేశ్వర్లు, డాక్టర్ రమణారెడ్డి, 50మంది ప్రత్యేకావసరాలు గల పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.