నీటిపారుదల పథకాల అభివృద్ధికి కృషి
వెల్లటూరు(మేళ్లచెర్వు) : నియోజకవర్గంలో నీటి పారుదల పథకాల అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
వెల్లటూరు(మేళ్లచెర్వు) : నియోజకవర్గంలో నీటి పారుదల పథకాల అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం 99 కోట్ల రూపాయలతో నిర్మించిన మండలంలోని వెల్లటూరు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఎకరాలకు నీరందించేందుకు వెల్లటూరు, మఠంపల్లి మండలంలోని అమరవరం ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు. అంతకుముందు మండలకేంద్రంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణరెడ్డి, జెడ్పీటీసీ కర్నె వెంకటలక్ష్మీ, ప్రతాపరెడ్డి, మన్సారలీ, యరగాని నాగన్నగౌడ్, నియోజకవర్గ యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకర శివరాం యాదవ్, జక్కుల మల్లయ్య, ఐల వెంకన్న, బాణోతు బాబు, మైల నాగిరెడ్డి, మోర్తాల వెంకటరెడ్డి, లిప్టు చైర్మన్ సీతరాంరెడ్డి, అణివిరెడ్డి, గోనె అంకయ్య,నారాయణరెడ్డి, అమరబోయిన శ్రీనివాస్‌యాదవ్, సాధం గంగయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.