ఖమ్మం జిల్లా లో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చేయి తెగిపోయింది.
ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం కర్రివారిగూడెం సమీపంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చేయి తెగిపోయింది. వివరాలివీ... పెద్దతండా గ్రామానికి చెందిన భూక్యా రాధ తన భర్తతో కలసి కట్టెలు వేసుకుని సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాధ కుడి చేయి తెగిపడిపోయింది. ఆమె భర్తకు గాయాల య్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.