గుట్కా ప్యాకెట్లను కాల్చి వేసిన పోలీసులు | The police burned quid packets | Sakshi
Sakshi News home page

గుట్కా ప్యాకెట్లను కాల్చి వేసిన పోలీసులు

Jul 1 2016 3:20 PM | Updated on Aug 21 2018 5:54 PM

గుట్టు చప్పుడు కాకుండా గుట్కాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా గుట్కాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం మొహమ్మద్ నగర్‌లో పలు దుకాణాలపై దాడులు నిర్వహించిన పోలీసులు మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని వాటిని కాల్చి వేశారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement