అదుపుతప్పి బావిలో పడిన కారు | The car landed on the well | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి బావిలో పడిన కారు

Sep 9 2016 12:53 AM | Updated on Aug 11 2018 8:45 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడి డ్రైవర్‌ మృతిచెందిన ఘటన మండలంలోని నడికూడ శివారులో గురువారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నడికూడ గ్రామానికి చెందిన దుప్పటి బిక్షపతి–కాంతమ్మ దంపతుల చిన్న కుమారుడు క్రాంతి(25) డిగ్రీ చదివి, కొంతకాలంగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

పరకాల: వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడి డ్రైవర్‌ మృతిచెందిన ఘటన మండలంలోని నడికూడ శివారులో గురువారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నడికూడ గ్రామానికి చెందిన దుప్పటి బిక్షపతి–కాంతమ్మ దంపతుల చిన్న కుమారుడు క్రాంతి(25) డిగ్రీ చదివి, కొంతకాలంగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం హన్మకొండకు వెళ్లి రాత్రి నడికూడ చేరుకున్నాడు. అదేరాత్రి మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఉన్న తమ పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. కాసేపటి తర్వాత తిరిగి వస్తుండగా నడికూడ శివారులో కారు అదుపు తప్పి రోడ్డుకు 100 మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి క్రాంతి అక్కడికక్కడే మృతి చెందాడు. నడికూడ గ్రామానికి చెందిన రైతు గోనెల రమేష్‌ తన వ్యవసాయ బావిలో వాహనం పడి ఉందని పోలీసులకు సమాచారం అందించగా, సీఐ జె.నర్సిం హులు, ఎస్సై దీపక్‌ బావి వద్దకు చేరుకున్నారు. క్రేన్‌ సహయంతో బావిలోంచి కారు బయటకు తీసి మృతి చెందింది క్రాంతిగా గుర్తించారు. మృతుడి తండ్రి బిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement