breaking news
the well
-
స్టేటస్ పెట్టి.. బావిలో దూకాడు
భూదాన్‌పోచంపల్లి: వ్యవసాయబావిలో దూకి ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడేనికి చెందిన నోముల ఆకాశ్‌రెడ్డి(17) భూదాన్‌పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మ్యాథ్స్ అర్థం కావడంలేదని, లె క్చరర్ హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారని వేరే కళాశాలలో చేరుతానని చెబుతుండేవాడు. అన్నట్టుగానే ఐదు రోజుల క్రితం టీసీ తీసుకొని పట్టణ పరిధిలోని మోడల్ స్కూల్లో చేరాడు. స్టేటస్ పెట్టిన 10నిమిషాల్లోనే..: ‘నేను చనిపోవడానికి మా జూనియర్ కళాశాల మ్యాథ్స్ లెక్చరర్, తోటి విద్యార్థిని కారణం’అని ఆదివారం మధ్యాహ్నం 12.55కి తన మొబైల్ లో స్టేటస్ పెట్టాడు. అతని స్టేటస్ చూ సిన స్నేహితులు... ఆకాశ్‌రెడ్డి తల్లి అరుణకు చెప్పారు. అదే సమయంలో అక్కడి కి వచ్చిన ఆకాశ్‌ను ప్రశ్నించగా... సరదాగా పెట్టానంటూ వెళ్లిపోయాడు. అనంతరం సైకిల్‌పై గ్రామ సమీపంలోని వ్య వసాయ బావి వద్దకు వెళ్లాడు. రోడ్డు పక్కన సైకిల్, గట్టు పైన చెప్పులు,సెల్‌ఫోన్ పెట్టి బావిలో దూకాడు. అతని కోసం వెదుకుతుండగానే బావిలో దూకాడని గ్రామస్తులు చెప్పారు. భయంతోనేనా.. ఆకాశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థిని ఫొటోలను తన ఫోన్లో వాట్సప్ డీపీగా పెట్టుకునే వాడు. కాలేజీ మారాక కూడా కొనసాగించాడు. దీంతో సదరు విద్యార్థిని మ్యాథ్స్ లెక్చరర్‌కు చెప్పింది. దీనిపై సోమవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేద్దామని లెక్చరర్ చెప్పినట్లు సమాచారం. తనపై కేసు అవుతుందనే భయంతోనే బావిలోకి దూకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అంతేకాక ఆకాశ్ మానసిక స్థితి కూడా సరిగా ఉండదని తెలిసింది. అతడి తండ్రి నోముల శ్రీనివాస్‌రెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి అరుణ మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో పోలీసులు అర్ధరాత్రివరకు వెతికినా మృతదేహం దొరకలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
అదుపుతప్పి బావిలో పడిన కారు
పరకాల: వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడి డ్రైవర్ మృతిచెందిన ఘటన మండలంలోని నడికూడ శివారులో గురువారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నడికూడ గ్రామానికి చెందిన దుప్పటి బిక్షపతి–కాంతమ్మ దంపతుల చిన్న కుమారుడు క్రాంతి(25) డిగ్రీ చదివి, కొంతకాలంగా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం హన్మకొండకు వెళ్లి రాత్రి నడికూడ చేరుకున్నాడు. అదేరాత్రి మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఉన్న తమ పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. కాసేపటి తర్వాత తిరిగి వస్తుండగా నడికూడ శివారులో కారు అదుపు తప్పి రోడ్డుకు 100 మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి క్రాంతి అక్కడికక్కడే మృతి చెందాడు. నడికూడ గ్రామానికి చెందిన రైతు గోనెల రమేష్ తన వ్యవసాయ బావిలో వాహనం పడి ఉందని పోలీసులకు సమాచారం అందించగా, సీఐ జె.నర్సిం హులు, ఎస్సై దీపక్ బావి వద్దకు చేరుకున్నారు. క్రేన్ సహయంతో బావిలోంచి కారు బయటకు తీసి మృతి చెందింది క్రాంతిగా గుర్తించారు. మృతుడి తండ్రి బిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి
ఖమ్మంరూరల్ : మండలంలోని ఆరేకోడులో ప్రమాదశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సిలివేరు యాదయ్య (60) తన స్వంత పొలానికి నీళ్లు పెట్టేందుకు బావి వద్ద మోటారు ఆన్ చేయబోయే క్రమంతో కాలు జారి బావిలో పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో అక్కడే పొలంలో దూరంగా ఉన్న యాదయ్య కుమారుడు ఉరుకున వచ్చి చూడగా బావిలో మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.