మంగళవారం కురిసిన అకాల వర్షం ఓ బాలుడిని పొట్టన పెట్టుకుంది.
మంగళవారం కురిసిన అకాల వర్షం ఓ బాలుడిని పొట్టన పెట్టుకుంది. పిడుగుపాటుకు ఓ బాలుడు మృతిచెందిన సంఘటన షాబాద్ మండలంలోని నాగరగూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నాగరగూడకు చెందిన కేశపల్లి సాయిచరణ్‌రెడ్డి(13) మధ్యాహ్నాం వ్యవసాయం పొలం వద్ద ఉండగా ఉరుములు, మెరుపులతో కూడిన కొద్దిపాటి వర్షం పడింది. అంతలోనే పిడుగుపడి బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. కోడుకు మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.