అక్రమంగా మద్యం అమ్ముతున్నఓ వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అక్రమంగా మద్యం అమ్ముతున్నఓ వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రింగ్ బస్తీ నివాసి శ్రీనివాస్‌గౌడ్ (51) కిరాణా వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో అందులో బెల్టు షాపు కూడా నిర్వహిస్తు మద్యం బాటిళ్లు విక్రయాలు చేపట్టసాగాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఆదివారం మధ్యాహ్నం తనిఖీలు చేయగా 12 క్వార్టర్ బాటిళ్లు దొరికాయి. ఈ మేరకు పోలీసులు శ్రీనివాస్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.