
విద్యార్థులకు ‘పరీక్ష’..
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన సాయిని రాజయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.
చొప్పదండి/పెద్దపల్లి రూరల్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన సాయిని రాజయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్దకుమార్తె లావణ్య రుక్మాపూర్ మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. రాజయ్య మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకున్నా బంధువుల ఓదార్పులతో గురువారం హిందీ పరీక్షకు హాజరైంది.
అలాగే, గో దావరిఖని ఫైవ్ ఇంక్లయిన్‌కు చెందిన జొన్నాల సాయి ఆదిత్య పెద్దపల్లిలోని కృష్ణవేణి టాలెం ట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. కూలీ పని చేసుకునే అతడి తండ్రి అశోక్ అనారోగ్యంతో బుధవారం రాత్రి మరణించాడు. దుఃఖంలో ఉన్న ఆదిత్యకు బంధువులు ధైర్యం చెప్పి గురువారం హిందీ పరీక్షకు పంపించారు. పెద్దపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లి తం డ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.