తెలుగు ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు | telugu, Yarlagadda, Srikalahasti | Sakshi
Sakshi News home page

తెలుగు ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు

Aug 28 2016 11:40 PM | Updated on Sep 4 2017 11:19 AM

కవి సమ్మేళనంలో మాట్లాడుతున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

కవి సమ్మేళనంలో మాట్లాడుతున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

తెలుగు భాష ఔన్నత్యాన్ని దిగజారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులను నిలదీయాలని తెలుగుభాష పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, హిందీ అకాడమీ చైర్మన్‌ ఆచార్య పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పిలుపునిచ్చారు.

– జాతీయ తెలుగు కవిసమ్మేళనంలో యార్లగడ్డ
శ్రీకాళహస్తి: తెలుగు భాష ఔన్నత్యాన్ని దిగజారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులను నిలదీయాలని తెలుగుభాష పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, హిందీ అకాడమీ చైర్మన్‌ ఆచార్య పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలోని దూర్జటి రసజ్ఞ సమాఖ్యలో ఆదివారం జాతీయ తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 167 మంది కవులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగును విశ్వానికి పరిచయం చేస్తున్న కవులు, రచయితలు, సాహితీవేత్తలకు భరోసా ఇస్తానంటూ ఎన్నికల మేనిఫెస్టోలోని 49వ పేజీలో పొందుపరచిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టగానే విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో కవులు, రచయితలకు రూ.5 వేలు గౌరవ వేతనం ప్రతి నెలా అందిస్తానని పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో తెలుగుభాష ఖ్యాతిని చాటుతున్న కవుల సంక్షేవుం కోసం చేయూతనిస్తావుని చెప్పిన చంద్రబాబు వూట తప్పారని వివుర్శించారు. రెండేళ్ల కిందట విజయవాడలో జరిగిన మాతృ భాషా దినోత్సవ వేడుకల్లో దేశంలో హిందీ తర్వాత తెలుగు మాట్లాడేవారే అధిక సంఖ్యలో ఉన్నారని, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు విధిగా 2వ భాషగా పొందుపరుస్తావుని ప్రకటించినా ఇప్పటి వరకు అవులుకు నోచుకోలేదన్నారు. గోదావరి పుష్కరాలలో తెలుగుభాషాభివృద్ధి కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామని సీఎం ప్రకటించినా ఇప్పటివరకు ఆ ఊసే లేదని ఆయన వివుర్శించారు. రాష్ట్ర రాజధాని అవురావతి శంకుస్థాపన శిలాఫలకాలపై ఆంగ్లభాషలో అక్షరాలు ఉండడంపై తాము అప్పట్లోనే ఆందోళన కార్యక్రవూలు చేపట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement