హైదరాబాద్‌లో సైకో సూదిగాడు... | syringe psycho stabs girl student in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సైకో సూదిగాడు

Sep 5 2015 12:11 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్‌లో సైకో సూదిగాడు... - Sakshi

హైదరాబాద్‌లో సైకో సూదిగాడు...

హైదరాబాద్ నగరంలో సూది సైకో కలకలం సృష్టించాడు.

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా వాసులను వణికిస్తున్న ఇంజక్షన్‌ దాడులు హైదరాబాద్‌ కూ పాకాయి. మల్కాజ్‌గిరిలో నాలుగో తరగతి విద్యార్థిని రమ్యపై ఇంజక్షన్‌ దాడి జరిగింది. శనివారం ఉదయం రమ్య స్కూల్‌కి వెళ్తున్న సమయంలో... బైక్‌పై వచ్చిన ఆగంతకుడు ఆమెకు ఇంజక్షన్‌ గుచ్చి పరారయ్యాడు. బాధితురాలు లిల్లీపుట్‌ మోడల్‌ స్కూల్లో చదువుతోంది. రమ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.

 

కాగా  ఇంజక్షన్ దాడులు ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాను వణికిస్తున్నాయి. ఇంజక్షన్ దాడులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేసిన ఫలితం శూన్యం. ఇప్పటి వరకూ ఆగంతకుడిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ఇంజక్షన్ దాడి స్థానికంగా కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement