క్రీడా సామగ్రి పంపిణీ | sports item distributed to students | Sakshi
Sakshi News home page

క్రీడా సామగ్రి పంపిణీ

Aug 16 2016 11:53 PM | Updated on Sep 4 2017 9:31 AM

నెన్నెల హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పని చేసి కీర్తిశేషులైన పిరంగి రాజయ్య స్మారకార్థంగా ఆయన మనువడు భట్టు హరీశ్‌ హైస్కూల్‌ విద్యార్థులకు రూ.16 వేలతో క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ క్రీడా సామగ్రిని ఎంపీపీ కళ్యాణి విద్యార్థులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కళ్యాణి మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా ఉన్న వారు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు.

నెన్నెల : నెన్నెల హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పని చేసి కీర్తిశేషులైన పిరంగి రాజయ్య స్మారకార్థంగా ఆయన  మనువడు భట్టు హరీశ్‌ హైస్కూల్‌ విద్యార్థులకు రూ.16 వేలతో క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ క్రీడా సామగ్రిని ఎంపీపీ కళ్యాణి విద్యార్థులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కళ్యాణి మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా ఉన్న వారు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు.
       భవిష్యత్‌లో విద్యార్థులకు మరిన్నీ సేవా కార్యక్రమాలు చేస్తామని దాత భట్టు హరీశ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం హైస్కూల్‌లో పని చేస్తున్న తన మేనమామ పీడీ సిరంగి గోపాల్‌ కోరడంతోనే ఈ క్రీడాసామగ్రిని అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ను జెడ్పీటీసీ కొడిపె భారతి, కో ఆప్షన్‌ సభ్యులు ఇబ్రహీం, సర్పంచ్‌ ఆస్మా బేగం, ఎంఈఓ శ్రీధర్‌స్వామి, ఉపాధ్యాయులు, నాయకులు, గ్రామస్తులు అభినందించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement