'చేపలు పట్టే హక్కు కోసం ప్రత్యేక జీవో తెస్తాం' | Special GO to pass for fishing in Project, says Harish rao | Sakshi
Sakshi News home page

'చేపలు పట్టే హక్కు కోసం ప్రత్యేక జీవో తెస్తాం'

Jul 31 2016 7:11 PM | Updated on Sep 4 2017 7:13 AM

భూములు కోల్పోయిన ప్రజలకు ప్రాజెక్టులో చేపలు పట్టే హక్కు కోసం ప్రత్యేక జీవో తీసుకవస్తాం' అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.

మెదక్‌: భూములు కోల్పోయిన ప్రజలకు ప్రాజెక్టులో చేపలు పట్టే హక్కు కోసం ప్రత్యేక జీవో తీసుకవస్తాం' అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం మెదక్‌లో మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం సింగారం ప్రజలతో హరీశ్‌రావు చర్చించారు. ఈ సమావేశంలో వారితో జరిపిన చర్చలు సఫలమైయ్యాయి. 123 జీవో ప్రకారం తమ భూములు ఇచ్చేందుకు సింగారం గ్రామస్తులు అంగీకారం తెలిపారు.

1986లో సింగూరు ప్రాజెక్టును మెదక్‌ జిల్లాలో కట్టారనీ, ఇప్పటివరకూ డబ్బులు రాక నిర్వాసితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పుడు తమ ప్రభుత్వం 123 జీవో ప్రకారం నేరుగా నిర్వాసితులకే డబ్బులు చెల్లిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement