బుడత పాము బొజ్జలోకి బొచ్చుచేప! | snake swallows fish with narrow throught | Sakshi
Sakshi News home page

బుడత పాము బొజ్జలోకి బొచ్చుచేప!

Nov 15 2015 1:50 PM | Updated on Sep 3 2017 12:32 PM

బుడత పాము బొజ్జలోకి బొచ్చుచేప!

బుడత పాము బొజ్జలోకి బొచ్చుచేప!

ఈ పామును చూశారా...

ఈ పామును చూశారా...పొట్ట నింపుకోవడానికి పుట్టెడు అగచాట్లు పడుతోంది. 'పీక సన్నం.. ఆశ లావు' సామెత బాపతుగా.. మీటరు పొడవున్న ఈ బుడతపాము తన శక్తికి మించి.. అర కేజీ బొచ్చుచేపను ‘భుక్తి’గా దొరకపుచ్చుకుని.. దాన్ని మింగడానికి పెద్ద కసరత్తే చేసింది. చివరికి ఎలాగైతేనేం మొత్తం చేపను బొజ్జలోకి నెట్టి..వేటను విజయవంతంగా ముగించింది. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో పంచాయతీ చెరువు వద్ద శనివారం 'సాక్షి'కెమెరాకు చిక్కిన దృశ్యాలివి.    - రాయవరం

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement