తిరుమలలో పాదరక్షల చోరీ ముఠాను టు టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
తిరుమల: తిరుమలలో పాదరక్షల చోరీ ముఠాను టు టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కొంత కాలంగా ఆలయం సమీపంలో భక్తుల చెప్పులు మాయం అవుతున్నాయి. దీనిపై భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు చెప్పుల దొంగలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
శనివారం ఎట్టేకలకు చెప్పులను దొంగిలించే ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ శ్రీవారి ఆలయం వద్ద హాకర్లుగా పనిచేసే వారుగా పోలీసులు గుర్తించారు.