భావ వ్యక్తీకరణ నైపుణ్యాలతో అవకాశాలు | Sakshi
Sakshi News home page

భావ వ్యక్తీకరణ నైపుణ్యాలతో అవకాశాలు

Published Sun, Aug 14 2016 12:14 AM

Skills and opportunities for expression

జేఎన్‌టీయూ: భావవ్యక్తీకరణ నైపుణ్యాలు (కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌) పెంపొందించుకుంటేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఏపీ ఉన్నత విద్యామండలి  చైర్మన్‌ ఆచార్య ఎల్‌. వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. ఆచార్య వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లిష్‌తో పాటు జపనీస్, చైనీస్, స్పానిష్‌ భాషలను విద్యార్థులు నేర్చుకోవాలన్నారు. అనేక విదేశీ కంపెనీలు ఏపీకి రానుండడంతో విదేశీ భాషలు నేర్చుకున్న వారికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ.. కళాశాలలో ఉన్న వసతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజాన్ని ప్రేమించాలని.. అది మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుందన్నారు. 
 

Advertisement
Advertisement