జనగామలో కొనసాగుతున్న 144 సెక్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గురువారం హైదరాబాద్‌లో డీజీపీ అనురాగ్‌శర్మను క లిసి కోరారు.
						 
										
					
					
																
	- 
		డీజీపీని కలిసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు  పొన్నాల
	జనగామ : జనగామలో కొనసాగుతున్న 144 సెక్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గురువారం హైదరాబాద్‌లో డీజీపీ అనురాగ్‌శర్మను క లిసి కోరారు.
	జనగామ కాంగ్రెస్ శ్రే ణులతో కలిసి పొన్నాల డీజీపీ కా ర్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భం గా పొన్నాల మాట్లాడుతూ రెండు నెలలకు పైగా 144 సెక్షన్  విధించి ప్రజల హక్కులను కాలరాస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నా రు.  జనగామను 11వ జిల్లాగా చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మాట తప్పుతున్నారని విమర్శించా రు. ఆయన చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. రాజకీయ   ప్రయోజనాల కోసం జనగామ నియోజకవర్గాన్ని ముక్కలు చేయకుండా, జిల్లా చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. పొన్నాల వెంట  నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, రంగరాజు ప్రవీణ్ కుమార్, ధర్మపు రి శ్రీనివాస్, ఎండి అన్వర్, మేడ శ్రీ నివాస్, మంగ సత్యం, మేకల రాం ప్రసాద్, పన్నీరు రాధిక,ఆలేటి ల క్ష్మి,వెన్నెం శ్రీలత,మజార్ షరీఫ్, వ ంగాల మల్లారెడ్డి, సిద్దిరాములు, జక్కుల వేణుమాధవ్, కొండ శ్రీని వాస్,మాజీద్, అన్వర్ ఉన్నారు. 
						