19 నుంచి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌పై వర్కుషాపు | science work shop from 19 | Sakshi
Sakshi News home page

19 నుంచి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌పై వర్కుషాపు

Oct 18 2016 12:32 AM | Updated on Sep 4 2017 5:30 PM

జిల్లాలోని అన్ని యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్‌ ఉపాధ్యాయులకు 24వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణపై వర్కుషాపు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని అన్ని యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్‌ ఉపాధ్యాయులకు 24వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణపై వర్కుషాపు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి కచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు వర్కు షాపునకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ కోఆర్డినేటర్‌ రంగమ్మ లేదా జిల్లా విద్యా సమన్వయకర్త కె.వి.సుబ్బారెడ్డిని 8790111331, 9948605546 సెల్‌ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
 
డివిజన్ల వారీగా వర్కు షాపుల వివరాలు
 
డివిజన్‌ తేదీ వర్కుషాపు నిర్వహించే స్థలం
ఆదోని 19.10.16 ప్రభుత్వ బాలికల పాఠశాల
కర్నూలు 20.10.16 బి.క్యాంపు ప్రభుత్వ బాలుర పాఠశాల
డోన్‌ 21.10.16 శేషారెడ్డి హైస్కూల్, బేతంచెర్ల
నంద్యాల 22.10.16 ఎస్‌పీజీ హైస్కూల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement