రక్తదానంతో ప్రాణదాతలు కండి | save life..give blood | Sakshi
Sakshi News home page

రక్తదానంతో ప్రాణదాతలు కండి

Oct 19 2016 9:18 PM | Updated on Aug 21 2018 7:46 PM

రక్తదానంతో ప్రాణదాతలు కండి - Sakshi

రక్తదానంతో ప్రాణదాతలు కండి

రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించి ప్రాణదాతలుగా నిలవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగరంలోని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్స్‌లో మెగా రక్తదానం, నేత్ర వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ఆయా శిబిరాలను నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌ ప్రారంభించారు.

 


విజయవాడ(లబ్బీపేట) : రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించి ప్రాణదాతలుగా నిలవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగరంలోని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్స్‌లో మెగా రక్తదానం, నేత్ర వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ఆయా శిబిరాలను నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమర వీరుల స్ఫూర్తితో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. నిత్యం ఎంతో మంది ప్రమాదాల భారినపడుతూ రక్తాన్ని కోల్పోతుంటారని, అలాంటి వారికి సకాలంలో రక్తం ఎక్కించేందుకు ప్రతిఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా వృద్ధులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సంధ్య కంటి ఆస్పత్రి ముందుకు రావడం హర్షణీయమని చెప్పారు. దేశ రక్షణ కోసం, దేÔ¶  శాంతిభద్రతల పరిరక్షణలో మరణించిన వారిని స్మరించుకునేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రి, రెడ్‌క్రాస్, విజయశ్రీ బ్లడ్‌ బ్యాంక్‌లు శిబిరంలో రక్తాన్ని సేకరించాయి. 76 మంది పోలీస్‌ సిబ్బంది, 300 మంది ప్రజలు, విద్యార్థులు రక్తదానం చేశారు. కాగా సంధ్య కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరంలో 750 మందికి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్‌ కమిషనర్లు జీవీజీ అశోక్‌కుమార్, పాలరాజు, కోయ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement