కన్నుల పండువగా శని జయంతి | saneeswara jayanthi in pavagada | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా శని జయంతి

May 25 2017 11:00 PM | Updated on Sep 5 2017 11:59 AM

కన్నుల పండువగా శని జయంతి

కన్నుల పండువగా శని జయంతి

సర్వపాపహరుడు, శాంత స్వరూపుడు శనీశ్వరస్వామి జయంతి వేడుకలు గురువారం కన్నులపండువగా నిర్వహించారు.

పావగడ : సర్వపాపహరుడు, శాంత స్వరూపుడు శనీశ్వరస్వామి జయంతి వేడుకలు గురువారం కన్నులపండువగా నిర్వహించారు. స్థానిక శనీశ్వరాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా మండపంలో శనీశ్వరస్వామి, జ్యేష్టాదేవిమూర్తులను అలంకరించారు. మూడు రోజుల నుంచి శని జయంతి వేడుకలను పురస్కరించుకుని వేద పండితులు యజ్ఞ యాగాదులు, హోమాలు నిర్వహించారు. చివరి రోజు గురువారం వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శీతలాంబదేవికి సైతం మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement