ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఉపనిషత్‌లపై అవగాహన కలిగి ఉండాలని ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధానార్చకులు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు అన్నారు.
ఉపనిషత్‌లతో సమాజానికి దిశానిర్దేశం
Jul 25 2016 1:39 AM | Updated on Sep 4 2017 6:04 AM
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఉపనిషత్‌లపై అవగాహన కలిగి ఉండాలని ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధానార్చకులు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు అన్నారు. ఆదివారం స్థానిక పత్తేబాద శ్రీ సాయిమందిరంలో ఆంధ్రాబ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ వైహెచ్ రామకృష్ణ రచించిన ‘ఉపనిషత్ ఉద్యానవనం’ అనే గ్రంథావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపనిషత్‌లు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. అనంతరం గ్రంథాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఆంధ్రాబ్యాంక్ డీజీఎం జీఎస్‌వీ కృష్ణారావు, సీహెచ్ పూర్ణచంద్రరావు, డి.జయప్రకాష్ టి.వెంకట సుబ్బారావు, పసుమర్తి రత్తయ్య శర్మ, ఎం.గోపాల కృష్ణయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement