
తాగునీటికి రూ.14 కోట్లు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సమగ్ర రక్షిత మంచినీటి సరఫరాలోని 13 తాగునీటి పథకాల నిర్వహణ కోసం రూ.14.20 కోట్లు ఖర్చు
సిద్ధమైన ప్రతిపాదనలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సమగ్ర రక్షిత మంచినీటి సరఫరాలోని 13 తాగునీటి పథకాల నిర్వహణ కోసం రూ.14.20 కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని జెడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షురాలు పట్నం సునీతా మహేందర్ రెడ్డి వెల్లడించారు.
గురువారం జిల్లా పరిషత్‌లో జెడ్పీ పర్సన్ అధ్యక్షతన జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీపీఓ పద్మావతి, ఈఈ వెంకటరమణ, ఏఈ రత్నప్రసాద్‌తో తాగునీటి సరఫరాపై సమీక్ష జరిగింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నీటి నిర్వహణకు గ్రామ పంచాయతీలోని 14వ ఆర్థిక నిధుల నుంచి 40 శాతం, ప్రభుత్వ వాటాగా 60 శాతం నిధులను ఖర్చు చేస్తామని సునీతా రెడ్డి తెలిపారు. ఈ నిధులతో నీటి సరఫరా చేసే సిబ్బంది వేతనాలు, పంపుల నిర్వహణ, మరమ్మతులు వంటి పనులు చేపట్టాలని ఆమె అధికారులకు సూచించారు.